
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో ... సంస్థ చైర్మన్ వి నారాయణన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న నారాయణన్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు .
ఈ నెల 18 వ తేది 101 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. పీఎస్ఎల్వీ సి61 భూమి పరిశీలించేందుకు శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. 1962 లో శ్రీహరికోటలో ప్రారంభించిన ఇస్రో 62 ఏళ్లలో 63వ పీఎస్ఎల్వీ ని లాంచ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ -వీ నారాయణన్ తెలిపారు.