
హైదరాబాద్, వెలుగు: పండుగల సీజన్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆఫర్లు ప్రకటించింది. 10 వేల మంది మర్చంట్లతో కలిసి రకరకాల డీల్స్‌ను కస్టమర్లకు అందించనున్నట్లు తెలిపింది. ప్రీమియం మొబైల్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు గ్రూప్ హెడ్ పరాగ్ రావు మీడియాకు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, వాషింగ్ మెషీన్లు వంటి కన్జూమర్ గూడ్స్‌కు కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంటుందని పేర్కొన్నారు. కస్టమర్లు10.25 శాతం వడ్డీకే పర్సనల్ లోన్లను తక్షణమే అకౌంట్లలో పొందవచ్చని తెలిపారు. కారు లోన్లను 7.5 శాతం వడ్డీకే ఇవ్వనున్నామని, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కట్టక్కర్లేదని అన్నారు.