హైదరాబాద్, వెలుగు: లోన్లను వేగంగా ఇచ్చేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్ వంటివి వేగంగా తీసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్‌వే ప్లాట్ఫామ్లోకి వెళ్లి వేగంగా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇతర బ్యాంకింగ్ సర్వీస్‌లు కూడా పొందొచ్చు.
ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా వేగంగా సర్వీస్‌లను అందించేందుకు ఎక్స్‌ప్రెస్‌వే తీసుకొచ్చామని, కస్టమర్లు తమకు తాముగా ఈ పనులు చేసుకోవచ్చు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లు కూడా ఎక్స్‌ప్రెస్‌వే ప్లాట్‌ఫామ్ ద్వారా సర్వీస్‌లు పొందొచ్చని వెల్లడించింది. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌లు తీసుకొస్తున్నామనడానికి ఎక్స్‌ప్రెస్‌వే నిదర్శనమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంట్రీ హెడ్ (పేమెంట్స్) పరాగ్ రావు పేర్కొన్నారు. సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘నౌ’ లో భాగంగా ఎక్స్‌ప్రెస్‌వేను తీసుకొచ్చారు.