రూ.25 లక్షల కోట్లకు హెచ్​డీఎఫ్​సీ లోన్ ​బుక్​

రూ.25 లక్షల కోట్లకు హెచ్​డీఎఫ్​సీ లోన్ ​బుక్​

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లోన్​బుక్ ​విలువ (బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌‌లు) --మార్చి 31, 2024 నాటికి  రూ.25.08 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదేకాలంలో వీటి విలువ రూ.16.14 లక్షల కోట్లు కాగా, వార్షికంగా 55.4 శాతం పెరిగాయని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది.

వీటిలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌‌తోపాటు విలీనమైన పూర్వపు హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్ లోన్లూ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ సేవింగ్ ఖాతా డిపాజిట్లు మార్చి 31, 2024 నాటికి సుమారుగా రూ.9 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 8.7 శాతం వృద్ధి చెందాయి.