హెచ్​డీఎఫ్​సీ గ్రాస్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లు@24.69 లక్షల కోట్లు

హెచ్​డీఎఫ్​సీ గ్రాస్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లు@24.69 లక్షల కోట్లు
  • వార్షికంగా 62 శాతం పెరుగుదల
  • 27 శాతం పెరిగిన డిపాజిట్లు

న్యూఢిల్లీ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు గత డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​లో అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ల విలువ (ఇచ్చిన అప్పులు) రూ.24,69,500 కోట్లకు చేరింది. 2022  డిసెంబర్​లో ముగిసిన మూడో క్వార్టర్​లోని అడ్వాన్సులతో (రూ.15,20,500 కోట్లు)తో పోలిస్తే ఇవి 62.4శాతం ఎక్కువ. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, సెప్టెంబర్ 30, 2023 నాటికి బ్యాంక్ గ్రాస్​ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లు రూ.23,54,600 కోట్ల నుంచి 4.9శాతం పెరిగాయి. ఇంటర్-బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు,  బిల్లుల రీడిస్కౌంట్​వసూళ్లు, బ్యాంక్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌ల విలువ డిసెంబర్ 31, 2022 నాటికి దాదాపు 60.7శాతం,  సెప్టెంబర్ 30, 2023 నాటికి దాదాపు 3.8శాతం పెరిగింది. దేశీయంగా  రిటైల్ లోన్లు వార్షికంగా 111 శాతం పెరిగాయి. 

సీక్వెన్షియల్​గా  దాదాపు 3.0శాతం పెరిగాయి. వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 6.5శాతం పెరిగాయి.  కార్పొరేట్, ఇతర టోకు లోన్లు  సీక్వెన్షియల్​గా రెండు శాతం పెరిగాయి. డిపాజిట్లు 1.9శాతం పెరిగి రూ.22,14,000 కోట్లకు చేరుకున్నాయి.  సెప్టెంబర్ 2023 చివరి నాటికి వీటి విలువ రూ.21,72,900 కోట్లు ఉంది. డిపాజిట్లు సంవత్సరానికి 27.7శాతం వృద్ధి చెందాయి. సీక్వెన్షియల్​గా రిటైల్ డిపాజిట్లు 2.9శాతం పెరగగా, టోకు డిపాజిట్లు 3.4శాతం క్షీణించాయి.   బ్యాంక్  కాసా డిపాజిట్లు మూడో క్వార్టర్​లో సుమారు రూ.8,35,500 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్​ వృద్ధి 2.2శాతం శాతం ఉంది. రిటైల్ కాసా డిపాజిట్లు వార్షికంగా దాదాపు 10 శాతం పెరిగాయి. సీక్వెన్షియల్​గా ఇవి 2.3శాతం పెరిగాయి. బ్యాంక్  కాసా నిష్పత్తి డిసెంబర్ 31, 2023 నాటికి 37.7శాతంగా ఉంది. డిసెంబర్ 31, 2022 నాటికి 44 శాతం,  సెప్టెంబర్ 30, 2023 నాటికి 37.6శాతం ఉంది.