వడ్డీ రేట్లు రాత్రికి రాత్రి పెంచిన HDFC బ్యాంక్.. కస్టమర్లు షాక్

వడ్డీ రేట్లు రాత్రికి రాత్రి పెంచిన HDFC బ్యాంక్.. కస్టమర్లు షాక్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. లోన్లపై వడ్డీ రేట్లను రాత్రికి రాత్రే పెంచేసింది. బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) రేట్లను 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.95 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గింది. ఒక సంవత్సరం MCLRతో రుణం తీసుకున్న వినియోగదారుల రుణాలకు, MCLR 5 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇది 9.10 శాతం నుంచి 9.15 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఒక సంవత్సరం, రెండేళ్లకు 0.05 శాతం MCLR పెంచింది. ఇది 9.20 శాతం నుండి 9.20 శాతానికి పెరిగింది.

తాజాగా పెంచిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 7నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన వాటిపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌లో 15 బిపిఎస్ పెరిగిన తర్వాత, అది 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల MCLR 0.10 శాతం పెరిగింది. ఇది 8.45 శాతం నుండి 8.55 శాతానికి పెరిగింది.