34 శాతం పెరిగిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ లాభం

34 శాతం పెరిగిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ లాభం
  •     మూడో క్వార్టర్​లో రూ. 16,373 కోట్లు

న్యూఢిల్లీ: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ డిసెంబర్ 2023తో ముగిసిన మూడో క్వార్టర్లో తన స్టాండ్ అలోన్ నికర లాభం 34 శాతం పెరిగి రూ.16,373 కోట్లకు చేరుకుంది.   క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ రూ.12,259 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్లో స్టాండ్​ అలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఇది క్రితం ఏడాది కాలంలో రూ.51,208 కోట్లుగా ఉందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన బ్యాంక్ లాభం రూ.12,735 కోట్ల నుంచి 39 శాతం పెరిగి రూ.17,718 కోట్లకు చేరుకుంది. 

కన్సాలిడేటెగ్​గా మొత్తం ఆదాయం అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్ చివరినాటికి రూ.54,123 కోట్ల నుంచి రూ.1,15,015 కోట్లకు పెరిగింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏలు) ఒక సంవత్సరం క్రితం 1.23 శాతం నుంచి డిసెంబర్ 2023 చివరి నాటికి స్థూల రుణాలలో 1.26 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్‌‌పీఏలు గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ ముగింపులో 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయి.