7వేల జీతంతో టూవీలర్ లోన్.. హెచ్ డీఎఫ్ సీ ప్రకటన

7వేల జీతంతో టూవీలర్ లోన్..  హెచ్ డీఎఫ్ సీ ప్రకటన

కష్టమర్లను ఆకట్టుకునేందుకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు నెలకు రూ.7వేలు సంపాధిస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం లోన్ తీసుకొని  టూవీలర్ ను కొనుగోలు చేయండి అంటూ హెచ్ డీఎఫ్ సీ ప్రకటన చేసింది.

టూవీలర్ లోన్ కావాలంటే  జాబ్ చేసేవారికి రూ.15వేలు జీతం ఉంటేనే టూవీలర్ లోన్ తీసుకునే అవకాశం ఉంది. హెచ్ డీఎఫ్ సీలో టూవీలర్ లోన్ కావాలంటే రూ.7వేల జీతం ఉంటే సరిపోతుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం చేసేవారికి వార్షిక వేతనం రూ.84వేలు, బిజినెస్ చేసే వారి వార్షిక వేతనం రూ.72 వేలు ఉండాలని షరతులు విధించింది.

స్కీం లో భాగంగా నిర్ధేశించిన వాహనాలకే లోన్ సౌకర్యం ఉంటున్నట్లు తెలుస్తోంది. లోన్ తీసుకునే వారు ఏడాది నుంచి నాలుగేళ్లలోపులోనే మొత్తం చెల్లించాలని, ప్రాసెసింగ్ ఫీజ్ 3శాతం, డాక్యుమెంటేషన్ 2శాతం, లోన్ వడ్డీరేటు 10శాతంతో ప్రారంభం అవుతున్నట్లు తెలిపింది.  హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు సదరు బ్యాంక్ నిర్వాహకులు చెబుతున్నారు.