డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో రూ.70 లక్షలు టొకరా

డబుల్  బెడ్రూమ్ ఇళ్ల పేరుతో రూ.70 లక్షలు టొకరా

హైదరాబాద్‌‌, వెలుగు: డబుల్‌‌బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్‌‌ఓటీ పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుని నుంచి 8 లక్షల క్యాష్‌ ఫేక్ అలాట్మెంట్‌ లెటర్స్‌‌, స్టాం ప్స్ స్వాధీనం చేసుకున్నారు. చీటింగ్‌‌ వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈస్ట్గోదావరి జిల్లా నడిమిలంకకు చెందిన గుతుల ప్రశాంత్‌‌(28) కెపీహెచ్‌‌బీలో ఉంటున్నాడు. డబుల్‌‌బెడ్రూమ్ ఇండ్లపేరుతో ఈజీగా మనీ కొట్టేయాలని విజన్ 1 టీవీ ఏర్పాటు చేశాడు. ప్రెస్‌‌ఐడీ కార్డ్ చూపించి, డబుల్‌ ‌ఇండ్లు ఇప్పిస్తానని జనాన్ని నమ్మిస్తున్నాడు. నిజాంపేట్‌‌, ఖైత్లాపుర్‌ ఏరియాల్లో వివిధ మీడియాసంస్థల్లో పని చేస్తున్న వారిని ట్రాప్‌ చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1.55 లక్షల నుంచి రూ.1.70లక్షల వరకు వసూలుచేశాడు.10రోజుల తర్వాత గవర్నమెంట్‌ ఆఫ్‌‌ తెలంగాణహౌసింగ్‌‌ డిపార్మట్‌ ట్‌పేరుతో,మేడ్చల్‌‌జిల్లా సెక్షన్‌ ఆఫీసర్‌ఫోర్జరీ సైన్‌‌తో నకిలీ అలాట్‌ ‌మెంట్‌ లెటర్స్‌ ఇచ్చేవాడు. కేపీహెచ్‌‌బీ,కూకట్‌‌పల్లి,బాచుపల్లి,మియాపూర్‌పోలీస్‌ స్టేషన్ పరిధిలో దాదాపు 40 మంది నుంచి రూ.70 లక్షలకు పైగా వసూలు చేశాడు.

ఎస్ఐనంటూ ఫేక్ ఐడీ కార్డు

ప్రశాంత్.. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌ ఎస్ఐగా ఫేక్ ఐడీ కార్డు తయారుచేయించి, నేషనల్‌‌ హైవేస్‌‌పై టోల్‌‌ఫీజు చెల్లించకుండానే ట్రావెల్‌‌చేసేవాడు. గత నెల 24 న విజయవాడ భవానీ నగర్లో వెహికల్‌ చెకింగ్‌‌లో ఫేక్‌ ఐడీ చూపి పోలీసులకు దొరికి, జైలుపాలయ్యాడు. ప్రశాంత్‌‌ మోసాలపై సమాచారం అందుకున్న మాదాపూర్‌ స్పెషల్‌‌ ఆపరేషన్‌ టీమ్‌ సోమవారం కేపీహెచ్‌‌బీ కాలనీ ఎంఐజీ2లోని ఇంట్లో అరెస్ట్చేసింది. ఫేక్‌ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌కి తరలించింది.