అతడు కీర్తి బాయ్​ఫ్రెండ్​ కాదట

అతడు కీర్తి బాయ్​ఫ్రెండ్​ కాదట

టాలీవుడ్​ మహానటి కీర్తి సురేశ్​ తనకు కాబోయే భర్తను పరిచయం చేసిందా? సోషల్​ మీడియాలో ఇప్పుడిదే హాట్​ టాపిక్​గా మారింది. ఫర్హాన్​ అనే వ్యక్తితో కీర్తి ఒకే కలర్​ కాస్ట్యూమ్స్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇంకేముంది సోషల్ మీడియా పుణ్యమా అని అవి కాస్త క్షణాల్లో  వైరల్ గా మారాయి. అతడికి బర్త్​డే విషెస్​ చెప్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్​ చేసింది కీర్తి.

దీంతో ఓ బిజినెస్​మెన్​ను కీర్తి పెళ్లాడనుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ వుడ్​బీ ఇతనే అంటూ నెటిజన్లు ఫిక్స్​ అయిపోయారు. నిజానికి అతడు కీర్తి చిన్ననాటి స్నేహితుడని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి చదువుకున్నారట. అతడు ఆమె బాయ్​ ఫ్రెండ్​ కాదని.. ఫ్రెండ్​ మాత్రమేనని కొందరు కామెంట్స్​ చేస్తున్నారు.

ఇక తాజాగా దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి​తో చేస్తున్న భోళా శంకర్​ మూవీ రిలీజ్​కు సిద్ధమవుతుంది.