
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో దారుణంగా కొట్టి చంపాడో భర్త. మోతిలాల్ కాలనీకి చెందిన ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన చాందినీని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆయాన్(10), కూతురు ఏంజిల్(5) ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానంతో ఇద్దరు గొడవ పడేవారు. ఇదే విషయంపై ఆదివారం రాత్రి భార్య చాందినికి, ప్రవీణ్‌లకు మధ్య గొడవ జరిగింది. సోమవారం తెల్లవారు జామున భార్య, ఇద్దరు పిల్లలను రాడ్‌తో కొట్టి చంపాడు. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు.