
నర్వ, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని నారాయణపేట జిల్లాలో భార్య గొంతుకు తాడు బిగించి చంపేశాడో భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. నర్వ మండలం పెద్దకడుమూర్కి చెందిన మునెప్ప, శ్యామలమ్మ(36)భార్యాభర్తలు. వీరికి నలుగురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన మునెప్ప రెండేండ్లుగా ఖాళీగా ఉంటూ డైలీ లిక్కర్ కోసం భార్యతో గొడవపడేవాడు. గురువారం తెల్లవారుజామున తాగేందుకు పైసలియ్యమని మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఇవ్వకపోయేసరికి తాడుతో శ్యామలమ్మ గొంతు బిగించి చంపేశాడు. మృతురాలి అన్న గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఘటనా స్థలాన్ని మరికల్ సీఐ శివ కుమార్, నర్వ ఎస్సై విజయ్ భాస్కర్ పరిశీలించారు. మునెప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.