బతికున్నడని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకున్నరు

బతికున్నడని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకున్నరు

కరీంనగర్ జిల్లాలో చని పోయిన వ్యక్తిని కోమాలో ఉన్నాడని నమ్మించి భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ ఘటన మానకొండూరులో చోటుచేసుకుంది. చనిపోయిన ఇంటి యజమాని.. కోమాలో ఉన్నాడని తహసీల్దార్ ను నమ్మించి కుటుంబ సభ్యులు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించారు. అందుకు తమ తండ్రి డెడ్ బాడీని కొడుకులు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్నాడని అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు.

కల్లెడ గ్రామానికి చెందిన వీరయ్య పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తమ పేరు మీద చేసుకోవాలనే ఆశతో అతని కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. అనుమానం వచ్చిన తహసీల్దార్.. బయట ఆటోలో ఉన్న వీరయ్యను పరిశీలించే సరికి విషయం బట్టబయలైంది. వీరయ్య ప్రాణాలతో లేడని డాక్టర్ ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యుల ప్లాన్ రివర్స్ అయింది. దీంతో  ప్రాణాలతో లేని వ్యక్తి ని తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించిన వారిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.