యాదగిరిగుట్ట టెంపుల్ లో 'హెడ్ కౌంట్' కెమెరా

యాదగిరిగుట్ట టెంపుల్ లో 'హెడ్ కౌంట్' కెమెరా
  • త్వరలో అందుబాటులోకి ఫేస్​ రీడింగ్​ కెమెరాలు కూడా..

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మార్చి 28న తిరిగి ప్రారంభించిన తర్వాత దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో రోజుకు ఎంతమంది భక్తులు వచ్చారో తెలుసుకోవడానికి 'హెడ్ కౌంట్' కెమెరా ఏర్పాటు చేశారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వచ్చే తూర్పు రాజగోపురం ఇన్ సైడ్ లో ఈ కెమెరా అమర్చారు. దీన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.

గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 11,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఆఫీసర్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు పనులు కంప్లీట్ అయితే ఫేస్ రీడింగ్ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తాయని ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావు తెలిపారు. ఫేస్ రీడింగ్ కెమెరాల ద్వారా ఒక భక్తుడు ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకున్నా ఒక్కసారి మాత్రమే కౌంట్ చేసి కచ్చితమైన సంఖ్యను నిర్ధారిస్తుందన్నారు.