Good Food : బాయిల్డ్ పల్లీలు.. గుండెకు మంచిది.. బరువూ తగ్గుతారు

Good Food : బాయిల్డ్ పల్లీలు.. గుండెకు మంచిది.. బరువూ తగ్గుతారు

జర్నీలో టైంపాస్ కోసం తినే పల్లీలు తింటుంటాం... చాలామంది ఉడకబెట్టిన పల్లీలను తింటుంటారు.  వీటిని టైం పాస్ కోసం తింటే మనకు తెలియకుండా ఎన్నో ఆరోగ్యలాభాలున్నాయి.  గుండెకు బలం చేకూర్చడంలో ఉడకబెట్టిన పల్లీలు కీలకపాత్ర పోషిస్తాయి.  వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు.  అందకే వీటిని పేదవారి బాదంపప్పు అంటారు. రోజు పిడికెడు ఉడకబెట్టిన పల్లీలు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. . . .  .

ఎల్లప్పుడూ సరసమైన ధరలలో లభించే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు  ఈ జాబితాలో వేరుశెనగకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. బాదం, పిస్తా, జీడిపప్పు మొదలైన వాటికి మనం ఇచ్చే ప్రాముఖ్యత వేరుశెనగకు ఇవ్వడం లేదనే చెప్పాలి. "పేదవాళ్ళ బాదం" అని పిలువబడే వేరుశెనగలో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ చిన్న పంటలో ప్రోటీన్ నుండి ఆరోగ్యకరమైన కొవ్వుల వరకు, అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువును నిర్వహించడం, యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు ఉడకబెట్టిన వేరుశెనగలో ఉంటాయి. ఉడకబెట్టిన వేరుశెనగలను మీ ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే చాలా ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండెకు చాలా మంచిది

ప్రతిరోజూ కేవలం కొన్ని వేరుశెనగలను తినడం వల్ల గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుంది మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధ్యయనాల ప్రకారం, వేరుశెనగ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ E యొక్క అద్భుతమైన మూలం, ఇది ధమనులు అడ్డుపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే వేరుశెనగలోని రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం గుండె సమస్యలతో పోరాడుతుంది..  ఆహారంలో తక్కువ మొత్తంలో వేరుశెనగను చేర్చడం వల్ల మీ మెదడు శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అధ్యయనాల ప్రకారం, ఇది అల్జీమర్స్ వ్యాధి వంటి వ్యాధులను గణనీయంగా తగ్గిస్తుంది. ఉడకబెట్టిన వేరుశెనగలో విటమిన్ బి3 లేదా నియాసిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గుతారు

 ఉడికించిన వేరుశనగలో క్యాలరీలలో తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన వేరుశనగ తినడం ఉత్తమం. ఉడికించిన వేరుశనగలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణ సంబంధిత సమస్యలను సులభంగా నయం చేయడంతోపాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.సాయంత్రం పూట ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల నీరసం నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా మెదడు పెరుగుదల,శరీర కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. 


 డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు

 ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వలన విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా శరీరంలో అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. ఎర్రరక్తకణాల పెరుగుదలకు ఈ విటమిన్ బి ఉపయోగ పడుతోంది. అలాగే ఎముకలు, నరాలు ఉత్తేజం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. మధ్యాహ్న భోజనం, రాత్రిభోజనం మధ్య సమయంలో సాయంకాలంపూట స్నాక్స్ సమయంలో ఉడికించిన వేరుశనగలు తీసుకోవడం వలన సాయంత్రం పూట వచ్చే నీరసం తగ్గుతుంది.

ఆరోగ్యానికి ఎంతో మేలు 

ఉడకబెట్టిన పల్లీలు  ఉదయాన్నే పొట్టు తియకుండా తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడకబెట్టిన పల్లీల్లో  ఉండే ప్రోటీన్లు అధిక శాతం మన శరీరానికి అందుతాయి. ఇందులో ఉండే పాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. దానితోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురికాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ వేరుశనగలు తినడం వల్ల, క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఉడకబెట్టిన పల్లీలు పొట్టుతో సహా తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి సన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విటమిన్-సి, గ్రీన్ టీల ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా నానబెట్టిన వేరుశనగ విత్తనాల తొక్కలోనే అధికంగా ఉన్నాయి. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు దరిచేరకుండా చేస్తాయి.

పోషకాలు సమృద్దిగా. . . 

 ఉడకబెట్టిన వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వేరుశెనగలను  ఉడకబెట్టినప్పుడు, బయోయాక్టివ్ సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్స్, సెలీనీయం, మెగ్నీషియం, ఐరన్‌ లభిస్తుంది.  ఇవి  ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. వేరుశెనగలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉడక బెట్టిన వేరుశెనగలో ఎక్కువ ప్రయోజనకరమని చైనాలోని షాంఘై యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.  మొలకెత్తిన, ఉడకబెట్టిన  వేరుశెనగలో ఫినాలిక్ సమ్మేళనాలు అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.  ఉడికించిన వేరుశెనగలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి. 

పుష్కలంగా విటమిన్ సి 

ఉడికించిన వేరుశనగలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడే బి కాంప్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. ఇక అంతేకాకుండా విటమిన్ డి శరీరంలో ఎర్రరక్తకణాలు పెరుగుదలకు తోడ్పడి, రక్తహీనత సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి. ఉడకబెట్టిన పల్లీల్లో  ఫ్లేవనాయిడ్స్,పాలీఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది శరీరంలో రక్షణ వ్యవస్థకు నష్టం కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్ వంటి సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతాయి.యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో, వాపును తగ్గించడంలో మరియు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు సెల్యులార్ ఆరోగ్యానికి దోహదపడతాయి.  కాబట్టి వీలైనంత వరకూ ఉడకబెట్టిన వేరుశనగ గింజలను రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.