
న్యూఢిల్లీ : కరోనా పై పోరులో హెల్త్ కేర్ సిబ్బందే వారియర్స్ అని కేంద్రం ప్రశంసించింది. వారికి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే ఫిర్యాదు చేసేందుకు స్పెషల్ గా కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపింది. సాలరీల్లో కోత, లేట్ పేమెంట్, కిట్స్ ప్రొవైడ్ చేయకపోవటం, ఇళ్లు ఖాళీ చేయంటూ ఎవరి ఒత్తిడి తెచ్చిన ఈ కంప్లైంట్ సెల్ కు కాల్ చేయవచ్చని కోర్టుకు కేంద్రం తెలిపింది. హెల్త్ కేర్ ఉద్యోగుల ఇబ్బందులపై యూనైటెడ్ నర్సెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్. కె పౌల్, జస్టిస్ బి. ఆర్ గవయ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా నర్స్ అసోసియేషన్ తరఫున లాయర్ సుభాష్ చంద్రన్ హెల్త్ కేర్ సిబ్బంది సమస్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చాలా హాస్పిటల్స్ హాఫ్ సాలరీయే ఇస్తున్నాయని, కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేసే వారికి సరైన కిట్స్ ఇవ్వటం లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా దాదాపు 150 నుంచి 200 మంది నర్సులు సరైన ప్రొటెక్షన్ లేక కరోనా బారిన పడ్డారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను కోరింది. కరోనా పై పోరు చేస్తున్నా వారంతా వారియర్స్ అని వారికి ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఫిర్యాదుల కోసం స్పెషల్ కంప్లైట్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్స్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ప్రొటెక్షన్ కిట్స్ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కరోనా ట్రీట్ మెంట్ లో యునాని, హోమియో మందులను వాడేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మందులేని కొత్త వైరస్ విషయంలో ప్రయోగాలు సరికాదని వ్యాక్సిన్ వచ్చే వరకు వేచి చూడాలని తెలిపింది.