వ్యాక్సిన్ ట్రయల్‌తో ఆరోగ్యం పాడైంది.. రూ. 5 కోట్ల పరిహారమివ్వాలంటూ వాలంటీర్ నోటీసు

వ్యాక్సిన్ ట్రయల్‌తో ఆరోగ్యం పాడైంది.. రూ. 5 కోట్ల పరిహారమివ్వాలంటూ వాలంటీర్ నోటీసు

కొవిషీల్డ్‌‌ ట్రయల్స్‌‌లో ఆరోగ్యం పాడైంది

రూ.5 కోట్ల పరిహారం ఇవ్వండి సీరమ్‌కు వాలంటీర్ లీగల్‌ నోటీసు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు:  సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా(ఎస్‌‌‌‌ఐఐ) కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో పాల్గొన్న ఒక వ్యక్తికి సీరియస్‌‌‌‌ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ వచ్చాయని తెలిసింది. దీంతో కంపెనీకి, డ్రగ్‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీకి లీగల్‌‌‌‌ నోటీసులు జారీ అయ్యాయి. సేఫ్టీపై నమ్మించి మోసం చేసినందుకు తనకు పరిహారంగా రూ. 5 కోట్లను ఇవ్వాలని వాలంటీర్ డిమాండ్‌‌‌‌ చేశారు.  కొవిషీల్డ్ వ్యాక్సిన్‌‌‌‌ను ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌–-ఆస్ట్రాజెనికా కలిసి డెవలప్ చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌లో పాల్గొన్న తర్వాత సీరియస్ హెల్త్‌‌‌‌ ఇష్యూస్‌ను ఈ వాలంటీర్(వయసు 40 ఏళ్లు) ఎదుర్కొంటున్నారని ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్న ఓ న్యాయ సంస్థ లీగల్‌‌‌‌ నోటీస్‌‌‌‌లో పేర్కొంది. వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌ ప్రతికూలంగా ఉండడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌ ఆగిపోయాయి. సీరమ్‌‌‌‌ కూడా తమ ఇండియా ట్రయల్స్‌‌‌‌ అప్పుడు ఆపేయాల్సి వచ్చింది. రెగ్యులేటరీ నుంచి అనుమతులు వచ్చాక  వ్యాక్సిన్ ట్రయల్స్‌‌‌‌ను  తిరిగి స్టార్ట్‌‌‌‌ చేసింది.  ఈ అంశంపై సీరమ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌, డ్రగ్‌‌‌‌ రెగ్యులేటరీ, ఇండియన్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్ మెడికల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ స్పందించలేదు.

వచ్చే వారం కోర్టుకెళతాం..

లా కంపెనీకి చెందిన అడ్వకేట్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ రాజారామ్‌‌‌‌ మాట్లాడుతూ.. ఈ నెల 21 న సీరమ్‌‌‌‌కు, డ్రగ్ రెగ్యులేటరీకి లీగల్‌‌‌‌ నోటీసులు పంపామని, రెస్పాన్స్‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. వచ్చే వారం కోర్టులో రిట్‌‌‌‌ పిటీషన్‌‌‌‌ను వేస్తామని అన్నారు. తమిళనాడుకి చెందిన ఈ వాలంటీర్ శ్రీ రామచంద్ర ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌(చెన్నై) లో జరిగిన కొవిషీల్డ్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ 3 ట్రయల్స్‌‌‌‌లో పాల్గొన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, వాలంటీర్ ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులకు వ్యాక్సిన్‌‌‌‌ కారణమయ్యుండదని  శ్రీ రామచంద్ర ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ప్రధాన ఇన్వెస్టిగేటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌ ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ రామక్రిష్ణ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రిపోర్ట్‌‌‌‌ను ఎస్‌‌‌‌ఐఐకు, డ్రగ్‌‌‌‌ రెగ్యులేటరీకి పంపామని చెప్పారు. ట్రయల్స్‌‌‌‌ ఆపమని స్పాన్సర్ల నుంచి కాని, డ్రగ్‌‌‌‌ రెగ్యులేటరీ నుంచి కాని ఎటువంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ 3 ట్రయల్స్‌‌‌‌ను సీరమ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ జరుపుతోంది. మొత్తం 10 కోట్ల  డోసులను సప్లయ్‌‌‌‌ చేసేందుకు ప్రొడక్షన్‌‌‌‌ను కూడా ఎస్‌‌‌‌ఐఐ ప్రారంభించింది. కాగా, ప్రతికూల రిజల్ట్స్‌‌‌‌ రావడంతో  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఈ వ్యాక్సిన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ కొంత కాలం వరకు ఆగిపోయాయి.

For More News..

కమర్షియల్ ఫ్లైట్స్ కన్నా జెట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్‌కే డిమాండ్

నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు