ఆన్ లైన్ గేమ్స్ తో పరేషాన్..కెరియర్ హెల్త్ నాశనం చేసుకోకండి

ఆన్ లైన్ గేమ్స్ తో పరేషాన్..కెరియర్ హెల్త్ నాశనం చేసుకోకండి

బల్కం పేటకు చెందిన వంశీ లాక్ డౌన్ లో టైం పాస్ కోసం ఓ ఆన్ లైన్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. అలా అతడికి 10 మంది ఫ్రెండ్స్ అయ్యారు. రిలాక్సేషన్స్ తర్వాత అతడు డ్యూటీలో బిజీ అయ్యాడు. గేమ్ ఆడాలని ఫ్రెండ్స్ నుంచి రిక్వెస్ట్  వస్తుండడంతో వర్క్ పై  ఫోకస్ పెట్టలేకపోతున్నట్టు వంశీ చెప్తున్నాడు. ఎస్‌‌ఆర్ నగర్ చెందిన రాజేశ్‌లాక్‌డౌన్‌ టైమ్‌లోడైలీ కనీసం 6 గంటల పాటు లూడో ఆడేవాడు.ఇప్పుడతనికి ఆఫీస్‌‌ స్టార్టయింది. డ్యూటీకి వెళ్లేముందు, వెళ్లొచ్చిన తర్వాత కూడా గేమ్‌ ఆడకుండా ఉండలేకపోతున్నాడు. ఒక్కోసారి తెల్లవారు జాము వరకు ఆడి నిద్రపోతున్నానని, తన ఆన్ లైన్ గేమ్ రాజేష్ ఆందోళన  చెందుతున్నాడు.

 హైదరాబాద్, వెలుగు :  మూడు నెలల లాక్‌‌డౌన్    ‌‌పీరియడ్లో సిటి జన్స్ అంతా ఇండ్ల కే పరిమితమయ్యారు. చాలామంది బోర్ కొట్టకుం డా ఉండేందుకు ఆ న్ లైన్ గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.   ముఖ్యంగా యూత్, చిల్డ్రన్స్ లూడో లాంటి గేమ్స్ ను గంటల తరబడి ఆడి థ్రిల్‌‌ఫీలయ్యా రు. ఇప్పుడా ఆ ఆన్లైన్ గేమ్స్ వారిని ఓ ఆట ఆడుకుంటున్నాయి. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తర్వాత డ్యూటీలతో ఎంప్లాయీస్, ఆన్ లైన్ క్లాసెస్ తో స్టూడెంట్స్ , బిజినెస్ చేసే వాళ్లు బిజీ అయ్యారు. కానీ, ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటును మాత్రం వదిలించుకోలేకపోతున్నారు. టైంపాస్ కోసం స్టార్ట్ చేసినా అడిక్ట్  అయ్యే వరకూ వెళ్లామని లేట్ గా తెలుసుకుని బాధపడుతున్నారు.

హాబీ నుంచి అడిక్షన్ దాకా

కరోనాను కంట్రోల్ చేసేందుకు పెట్టిన లాక్‌‌ డౌన్ ‌‌చాలామంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది. కొందరు ఖాళీ టైమ్ ను సాను కూలంగా మలచుకుంటే, మరికొందరు  సమస్యలు సృష్టించుకున్నారు. బుక్ ‌‌రీడింగ్‌, ఆర్ట్, సినిమాలు, ఫిట్నెస్, బరువు తగ్గే ప్రయత్నం, వంటలు నేర్చుకోవడం వంటి పనులపై ఇంట్రస్టె పెట్టిన వాళ్లుకొత్త విషయాలు నేర్చుకుంటూ నే టైమ్ ‌‌పాస్ ‌‌చేశారు. టెంపరరీ రిలీఫ్‌‌కోసం ఆన్‌‌లైన్‌‌ గేమ్‌‌లను ఎంచుకున్నవాళ్లు మాత్రం ఇప్పటికీ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. టైమ్ వేస్ట్ తో పాటు హెల్త్ దెబ్బ తింటున్నట్లు తెలుస్తున్నా ఆడకుండా ఉండలేక పోతున్నామని చెప్తున్నారు. తాను క్యారమ్స్ ఆడకుండా ఉండలేకపోతున్నట్లు అంబర్‌‌పేటకు చెందిన వెంకటేశ్‌ తెలిపాడు. ఆన్ లైన్ గేమ్స్ నిద్ర లేకుండా చేస్తున్నాయని మరికొందరు వాపోతున్నారు. అలాంటి వారిలో యూత్ ఎక్కువ ఉన్నారు. ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. స్టడీస్‌‌, కెరీర్‌‌పై దృష్టి పెట్టాల్సి న టైమ్‌‌లో గేమ్‌‌ ప్లే అడిక్షన్ లో నష్ట పోవద్ద ని సైకాలజిస్ట్ లు సూచిస్తున్నారు. దాన్నుంచి బయటపడకపోతే సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాలక్షేపం కోసం ఆడేగేమ్‌‌లు నిత్యజీవితంలో భాగంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మితిమీరి ఆన్‌‌లైన్‌‌గేమ్‌‌లు ఆడితే మానసిక ఆందోళనకు దారి తీస్తుందంటున్నారు.

కెరీర్‌‌, హెల్త్ నాశనం చేసుకోవద్దు

ఆన్‌లైన్‌ గేమ్‌‌లకు అడిక్ట్‌‌ అయిన వాళ్లు లాభనష్టా లను కంపేర్ చేసుకోవాలి. ఒక పేపర్‌‌ మీద రాసు కోవాలి. తాత్కాలిక ఆనందం, దీర్ఘకాలిక నష్టా లను అంచనా వేసుకోవాలి. ముందుగా యాప్స్‌‌ అన్‌ ఇన్‌స్టాల్‌‌ చేసేయాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌‌ ఆడే ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పాలి. ఇకపై ఆన్‌లైన్ గేమ్ పరంగా  ఇన్నిగంటలు ఉంటానని కమిట్‌ అవ్వాలి. గంటల తరబడి గేమ్స్‌‌ ఆడటం వల్ల స్టడీస్‌‌, కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంప్లాయీస్ మరింత జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ ను  దెబ్బ తీసుకోవద్దు . ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం కూడా చాలా కష్టం. రాత్రి పూట నిద్ర లేకుండా గేమ్స్ ఆడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ‑ సి.వీరేందర్‌‌, సైకాలజిస్ట్