ఇంద్రవెల్లి, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్ ఆదేశించారు. ఇంద్రవెల్లిలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రికార్డులతో పాటు పలు రిజిస్టర్లను పరిశీలించారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులకు ప్రతి వారం చెకప్ చేయాలని, రక్తహీనత ఉన్నవారిని గుర్తించి పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
