ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెంచేలా మర్యాదగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఉట్నూర్ లోని పోలీస్స్టేషన్ ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
బాధితుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం వెంటనే పోలీసులకు అందేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహిచాలని, ఆర్థిక నేరాల్ని అరికట్టాలని సూచించారు. ఏఎస్పీ కాజల్ సింగ్,ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
