భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు పీహెచ్ సీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన జ్వర సర్వేను ఆరోగ్య విస్తరణ అధికారి వేంకట రాములు పరిశీలించారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు జ్వర సర్వే నిర్వహించారు.
ఈ సర్వేను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఇండ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆయన వెంట సెక్రటరీ లక్ష్మీ, ఏఎన్ఎం శ్యామల, అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఆశావర్కర్లు వనజ, రేణుక, లావణ్య తదితరులు పాల్గొన్నారు.