తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు

తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారు

రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్‌లో ‘సమగ్ర వ్యవసాయం – సుస్థిర వ్యవసాయం’అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి ఈటల రాజేందర్ మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లు పాల్గొన్నారు.

ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నందున పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని ఈటెల అన్నారు. మొదటి రెండు నెలలు లాక్‌డౌన్ విషయంలో సీరియస్‌గా వ్యవహరించాం కాబట్టే కరోనా ఎక్కువ స్థాయిలో విస్తరించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనాను ప్రజలెవరూ లైట్ తీసుకోవద్దని ఆయన అన్నారు. రాబోయే జూన్, జూలై నెలల్లో కరోనా మరింతగా విస్తరించే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి సంబంధించి ఏది సాధించాలన్నా.. ఏది శోధించాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని ఆయన అన్నారు. కరోనా అదుపులోకి వచ్చి.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తే వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను హుజురాబాద్ నియోజకవర్గానికి తీసుకువస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో రైతులు పంట పండించారని ఆయన అన్నారు. దేశంలో అందరికీ అన్నం పెట్టేవారు తెలంగాణ రైతులని ఆయన అన్నారు.

For More News..

కరోనా పేషంట్ల బ్లెడ్ శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి

కరోనా దెబ్బకు డీడీ న్యూస్ మూసివేత

నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ఇప్పుడు ఆత్మహత్య