
దేశంలో మంకీపాక్స్ వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ను కట్టడి చేసేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన పరుపులు,బట్టలు,తువ్వాళ్లు, ఇతర వస్తువులు వాడకూడదని తెలిపింది. వ్యాధి సోకిన వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేయాలని తెలిపింది. తద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందదని తెలిపారు. హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం, సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం, రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్‌లతో నోటిని,చేతులను డిస్పోజబుల్ గ్లోవ్స్‌తో కప్పుకోవడం,చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించాలని సూచించింది.
మంకీపాక్స్ సోకిన రోగి యొక్క బెడ్ లేదా తువ్వాలను పంచుకోవద్దని సూచించింది. వైరస్ సోకిన రోగితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దని తెలిపింది. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలను కనిపిస్తే.. బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావొద్దని తెలిపింది. తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్షచూపకూడదని...బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. మంకీపాక్స్ రోగితో ఆహారాన్ని పంచుకోవద్దని తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆందోళన కలిగించే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్..జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్ అని... వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ మశూచిని పోలి ఉంటుందని తెలిపింది. మంకీపాక్స్ ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు లిపారు.