ముహురత్ ట్రేడింగ్ 2025: తేదీపై క్లారిటీ వచ్చేసింది, ప్రత్యేక దీపావళి ట్రేడింగ్ ఎప్పుడంటే ?

ముహురత్  ట్రేడింగ్ 2025: తేదీపై క్లారిటీ వచ్చేసింది, ప్రత్యేక దీపావళి ట్రేడింగ్ ఎప్పుడంటే ?

 దీపావళికి ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో మంచి జోష్  నింపింది. శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 52 వారాల గరిష్టాన్ని చేరుకోగా, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. దింతో  ఇన్వెస్టర్ల కన్ను ఇప్పుడు  ముహురత్   ట్రేడింగ్ పై పడింది. ఈ రోజు నుండి హిందూ ఆర్థిక సంవత్సరం మొదలవుతుందనడానికి ఇదొక సంకేతం, శుభమైన రోజు కూడా.

చాలా ఏళ్ల తర్వాత సంప్రదాయంలో మార్పు: ఈ ఏడాది ముహురత్   ట్రేడింగ్ చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీకి బ్రేక్ వేసింది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా, ప్రత్యేకంగా ఒక గంట ట్రేడింగ్ సాయంత్రం కాకుండా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండూ దీపావళి రోజున శుభప్రదమైన లావాదేవీల కోసం ఒక గంటపాటు ఓపెన్  ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలో ఈ రోజు పెట్టుబడి పెట్టడం అదృష్టం, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అందుకే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయంగా చాలా మంది భావిస్తారు.

ముహురత్   ట్రేడింగ్ సాంస్కృతిక, ఆర్థిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుండి కొత్త సంవత్సరం మొదలవుతుందని సూచిస్తుంది. ఈ ప్రత్యేక రోజు  BSE, NSE రెండూ ట్రేడింగ్, సెటిల్‌మెంట్ కోసం ఓపెన్ చేస్తాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు దీన్ని స్మాల్ టైం ట్రేడింగ్ల కాకుండా, పండుగ సందర్భంగా చేసే పెట్టుబడిగా చూస్తారు.

2025లో ముహురత్  ట్రేడింగ్ ఎప్పుడంటే : ఈ ఏడాది దీపావళి పండుగ కొన్ని చోట్ల అక్టోబర్ 20న జరుపుకోనుండగా... కానీ కొన్ని ప్రాంతాలలో అక్టోబర్ 21న కూడా జరుపుకోనున్నారు. అయితే ఈ గందరగోళం లేకుండా ఉండడానికి NSE, BSE రెండూ 2025 ముహురత్   ట్రేడింగ్  అక్టోబర్ 21న ఉంటుందని అధికారికంగా ప్రకటించాయి.

ట్రేడింగ్ విండో మధ్యాహ్నం 1:45 నుండి 2:45 వరకు తెరిచి ఉంటుంది. అంటే సాధారణంగా సాయంత్రం జరిగే షెడ్యూల్‌కు భిన్నంగా ఉంటుంది. ప్రీ-ఓపెన్ సెషన్ అయితే మధ్యాహ్నం 12:30 నుండి 1:45 వరకు కొనసాగుతుంది.