ఈ లక్షణాలను లైట్​ తీసుకోవద్దు!

ఈ లక్షణాలను లైట్​ తీసుకోవద్దు!

ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని ఎవరూ పరీక్షించుకోరు. ఎందుకంటే.. చలాకీగా ఉన్నంత మాత్రాన ‘నాకేం.. భేషుగ్గా ఉన్నాను. నాకే రోగం లేదు’ అని జబ్బలు చరిచేసుకుంటారు.
అయితే.. చిన్న చిన్న సంకేతాలు ‘హలో.. కాస్త ఆరోగ్యం జాగ్రత్త’ అని హెచ్చరిస్తాయి.
వాటిని గనక సరిగ్గా గుర్తించలేకపోతే..  పెద్ద సమస్య వచ్చి పడుతుంది.
అందుకే.. ఆ సంకేతాలను లైట్​ తీసుకోకండి.

హెల్త్​ ఏ లెవెల్లో ఉందో.. బాడీ ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ ఇస్తూ ఉంటుంది. కానీ..  సరిగ్గా గమనించరు.. పట్టించుకోరు. మనం ఏం తిన్నా సరే.. దాని తాలూకు ప్రభావం వెంటనే చూపించడం శరీరానికి అలవాటు. అందుకే.. ఆరోగ్యం విషయంలో శరీరం ఇచ్చే సంకేతాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.

నోటి దుర్వాసన

చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తే.. నోరు వాసన వస్తుందో, అందరి ముందు అవమాన పడాల్సి వస్తుందో అని మాట్లాడేందుకు వెనకాడుతుంటారు చాలామంది.
అయితే.. దీనికి కారణం నోరు సరిగ్గా కడుక్కోకపోవడమో, బ్రష్​ సరిగ్గా చేయకపోవడమో అనుకుంటారు. కానీ.. అసలు కారణం ఏంటంటే.. శరీరంలో సరిపడా గ్లూకోజ్​ లేకపోతే ఇలా నోరు దుర్వాసన వస్తుంది. బాడీలో సరిపడా గ్లూకోజ్​ లేకపోతే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు పదార్థాలు కరుగుతాయి. దీంతో కీటోన్స్​ ఎంజైమ్స్​ విడుదల అవుతాయి. దీనివల్ల కేటోసిస్​ అనే మెటబాలిక్​ ప్రాసెస్​ జరిగి నోరు దుర్వాసన కొడుతుంది. కాబట్టి.. నోరు దుర్వాసన వచ్చినప్పుడు శరీరంలో సరైన మోతాదులో గ్లూకోజ్​ లేదని గ్రహించి డైట్​ చేంజ్​ చేసుకోవాలి​.

తరచూ మూత్రం రావడం..

చాలామంది ‘నాకు మూత్రం సాఫ్​ ఉంది.. నాకే రోగం లేదు’ అనుకుంటారు. అయితే.. అది యుక్తవయసులో ఉన్నంతవరకే. వయసు మీద పడుతున్న కొద్దీ బాడీలో చక్కెర నిల్వలు పెరిగి తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు శరీరం డీహైడ్రేట్​ అయినప్పుడు కూడా పదే పదే మూత్రం వస్తుంది. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని అనుకునేవాళ్లు కూడా ఉంటారు. అది కూడా తప్పే. యూరినల్ బ్లాడర్​ పనితీరు డిస్టర్బ్​​ అవడం వల్ల తరచూ మూత్రం వస్తుంది. ఇది భవిష్యత్తులో మూత్ర పిండాల వ్యాధికి దారి తీయొచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్​ను కన్సల్ట్​ కావడం బెటర్​.

ఇరిటేషన్..

శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్లు అందకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. కార్బోహైడ్రేట్లు సరిపడా అందకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో తొందరగా చిరాకు, కోపం రావడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే డోస్​ ఎక్కువ ఉండే ఫుడ్​ తీసుకోవాలి.

పెదాల పగుళ్లు

పెదాలు, నోటి చివర్లు తరచూ పగులుతుంటే.. మీ శరీరంలో ఐరన్​ లోపించిందని అర్థం. రాను రాను ఈ సమస్య మరింత పెరిగి నోటి అల్సర్​కు దారి తీయొచ్చు. శరీరంలో ఐరన్​ తగ్గిందని చెప్పడానికి వచ్చే ఈ సంకేతాన్ని మొదట్లోనే అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి.