
జిమ్‌కు వెళ్లి మజిల్స్ పెంచడం..సిక్స్, ఎయిట్ ప్యాక్..ఇప్పటి యూత్ కల. దీని కోసం చాలామంది రోజూ గంటల తరబడి సీరియస్‌గా వర్కవుట్స్ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా టైం కుదరక మధ్యలో మానేస్తేనే అసలు సమస్య మొదలవుతుందం టున్నారు డాక్టర్లు. సడన్‌గా వ్యాయమాం చేయడం బంద్ చేస్తే బాడీ షేప్ అవుట్ అవుతుందని, ఫ్యాట్ పెరుగుతుందని మాత్రమే తెలుసు. కానీ, కొత్త రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెబుతున్నారు. ఇలా సిటీలో ఎంతో మంది శరీరంలో మార్పులు వచ్చి బీపీ, షుగర్‌తో బాధపడుతూ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్లు, గుండె సమస్యలతో సతమతమవుతున్నారు. కండరాల పటుత్వం కోల్పోయి మెట్లు కూడా ఎక్కలేని స్థితికి వస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువయ్యాయని, 100 కేసుల్లో 20 వరకు ఇట్లాంటివే ఉంటున్నాయని చెబుతున్నారు. అందుకే సడన్ గా ఆపకుండా వాకింగ్, స్కిప్పింగ్ చేయాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు – ‘‘ కుషాయిగూడకు చెందిన సందీప్(30), ఫిట్‌నెస్ కోసం గత ఏడాది నుంచి ఏఎస్‌రావునగర్‌లోని జిమ్ కు వెళ్లేవాడు. ఇటీవల అతను కొత్త జాబ్‌లో చేరడంతో ఆఫీస్ టైమింగ్స్మారాయి. దీంతో రెండు నెలలు నుంచి జిమ్ ఆపేశాడు. క్రమంగా అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ షురూ అయ్యాయి. ఒక్కసారిగా అతని శరీరం బరువు పెరుగుతుండడంతో పాటు బాడీ షేప్ మారిపోయింది. బీపీ, షుగర్ లెవల్స్పెరిగాయి. దీంతో డాక్టరు వద్దకు వెళ్లాడు . టెస్ట్‌లు చేసి ఊపిరితిత్తుల పనితీరులో కొంత వరకు మార్పు వచ్చిందని చెప్పాడు డాక్టర్.
గ్రేటర్లో సుమారు చిన్నవి, పెద్దవి కలుపుకొని సుమారు 10వేల వరకు జిమ్ సెంటర్లు ఉన్నాయి. జిమ్ చేయడం యూత్‌కు ట్రెండ్‌గా మారడంతో వీటి సంఖ్య కూడా పెరుగుతోంది. కొందరూ ఆరోగ్యంగా ఉండేందుకు, మరికొందరు కండలు పెంచేందుకు జిమ్‌లకు వెళ్తుంటారు. అంతేగాక ఓపెన్ ప్లేసులు, పార్కులు వంటి స్థలాల్లో కూడా చాలామంది వ్యాయామం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం చెమటోడ్చుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు ఒక్కసారిగా మానేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్‌లు చేయకపోతే బాడీలో మార్పులు వచ్చి, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగి ఒబేసిటి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నరు. వ్యాయామం ఆపేసిన తర్వాత శరీరంలో కొవ్వుశాతం పెరిగి కండరాలు పట్టుత్వం కోల్పోయి పనితీరు తగ్గుతోంది. దీంతో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. తద్వారా లాంగ్టైంలో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉందంటున్నారు. ఇవి 25 నుంచి 40 మధ్య ఏళ్ల మధ్య ఏజ్ వారిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
సడన్‌గా మానేస్తే
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన కండరాలు అతి శ్రమకు గురవుతాయి. కానీ ఒక్కసారిగా ఆపేయడం వలన కండరాలు పట్టుత్వం కోల్పోయి వాటి పోగులు కుచించుకుపోతాయి. తద్వారా శరీరంలో కేలరీలు ఖర్చుకాక విపరీతమైన మార్పులు వస్తాయి. చిన్నమెట్లు ఎక్కినా కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. దీంతో పాటు త్వరగా అలసిపోయి నీరసించి పోతారు. మరోవైపు శరీరంలో కొవ్వు పేరుకుపోవడంతో బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో గుండె, ఊపిరితిత్తుల్లో ఉండే చురుకుదనం తర్వాత అంతగా కనిపించట్లేదని డాక్టర్లు చెబుతున్నారు. గత ఏడాది నుంచి ఈ తరహా కేసులు 15 నుంచి 20 శాతం వరకు వచ్చాయని పేర్కొంటున్నారు.
ఇవి చేస్తే కొంత వరకు మేలు
ప్రత్యేకించి జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయం లేని వారు ఇంట్లోనే స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి. అదే విధంగా మెట్లు కూడా ఎక్కుతూ ఉంటే మేలు. నిత్యం కుర్చిలకు పరిమితం కాకుండా కొంత వరకు నడుస్తుండాలి. అదే విధంగా శ్వాసపై ధ్యాస ఉంచే ధ్యానాలను చేస్తుండాలి.
ఇంట్లోనూ చేయొచ్చు
ప్రతిరోజు వ్యాయామం చేసేవారు ఆకస్మాత్తుగా మధ్యలో ఆపొద్దు. అలా చేస్తే కండరాల పనితీరులో మార్పు వచ్చి బాడీలో కూడా ఛేంజస్ వస్తాయి. ప్రతి రోజు తినే ఫుడ్ క్యాలరీలు ఖర్చుకాక, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఏ చిన్న పనిచేసినా వెంటనే ఆలసిపోతారు. ఒబేసిటీ తో పాటు లాంగ్‌టైమ్‌లో గుండె, ఊపిరితిత్తుల పనితీరు కూడా తగ్గుతుంది. జిమ్‌కు వెళ్లి వ్యాయమం చేసే టైం లేకపోయినా, ఇంట్లోనే ఏదో ఒక ఎక్సర్‌సైజ్ చేయడం బెస్ట్.
‑ ప్రవీణ్ కుమార్,రత్న ఫార్కే ర్యాపిడ్జిమ్ట్రైనర్
ఒక్కసారిగా ఆపొద్దు
జిమ్‌ల్ అధిక బరువుతో కూడిన పరికరాలతో ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది కాదు. దీంతో క్రమంగా కండరాల వ్యవస్థ వచ్చిన్నమై, ఒక్కసారిగా ఆపేస్తే ఆరోగ్యసమస్యలు వస్తాయి. వాకింగ్, స్కిప్పింగ్వంటివి మధ్యలో మానేసినా ప్రమాదం లేదు. కానీ ప్రతిరోజు ఎక్సర్‌సైజ్‌లు చేయడం వలన రక్తప్రసరణ వేగవంతమై, గుండె, ఊపిరితిత్తుల్లో పని తీరు సక్రమంగా ఉంటుంది. సాధారణ వ్యక్తుల కంటే, జిమ్ చేసే వారిలో గుండె పనితీరు బాగుంటుంది. అదే విధంగా జిమ్‌లకు వెళ్లే వారు ప్రోటీన్ పౌడర్కాకుండా, గుడ్లు, పాలును తీసుకోవాలి.
‑ డాక్టర్ అమరేశ్వర్,ఎండీ జనరల్ ఫిజీషియన్
బాడీ షేప్‌లో మార్పు వచ్చింది
ప్రతి రోజూ జిమ్ కు వెళ్తుంటా. మూడు నెలలుగా బిజీగా ఉంటూ వెళ్లడం లేదు. దీంతో క్రమంగా బాడీలో ఛేంజస్ వచ్చాయి. బరువు పెరిగాను. ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోతున్నా. డాక్టర్ల వద్దకు వెళ్లగా ఒక్కసారిగా జిమ్ ఆపేయడంతో కండరాల వ్యవస్థ విచ్చిన్నమై, బాడీషెప్ మారుతుందని డాక్లర్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఎక్సర్‌సైజ్ చేస్తుండాలని సూచించారు.
‑ అజయ్, స్టూడెంట్