హెల్త్​ ప్రొఫైల్​ పక్కాగా సేకరిద్దాం

హెల్త్​ ప్రొఫైల్​ పక్కాగా సేకరిద్దాం
  • వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ

ములుగు, వెలుగు: ప్రతి ఒక్కరి హెల్త్​ ప్రొఫైల్​ పక్కాగా సేకరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్​ వాకాటి కరుణ అన్నారు. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్​ప్రొఫైల్​చేపట్టారని, ఇందులో ములుగు ఒకటని అన్నారు. ములుగు కలెక్టరేట్​లో మంగళవారం కలెక్టర్​కృష్ణ ఆదిత్య, హెల్త్​ డైరెక్టర్​డాక్టర్​శ్రీనివాసరావు, సీఎం ఆఫీస్​ఓఎస్డీ డాక్టర్​ గంగాధర్​తదితరులతో కలిసి మెడికల్​ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతి మెడికల్ ​ఆఫీసర్ కు హెల్త్​ప్రొఫైల్​పై ట్రెయినింగ్ ​ఇవ్వాలని సూచించారు. హెల్త్​ డైరెక్టర్​డాక్టర్​శ్రీనివాస్​మాట్లాడుతూ గతంలో చికిత్స నిమిత్తం వచ్చిన వారి పేర్లు, సమస్యను రిజిష్టర్లలో నమోదు చేశామని, అదేపద్ధతిలో హెల్త్​ ప్రొఫైల్​ఉంటుందన్నారు. గ్రామంవారీగా ప్రతి ఒక్కరి హెల్త్​కండీషన్, బ్లడ్​గ్రూప్, టోటల్​బాడీ చెకప్, షుగర్​లెవల్స్, డయాలసిస్​ తదితర సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను హెల్త్​ప్రొఫైల్​లో పొందుపరిస్తే మెడిసిన్స్​అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల బరువు, ఎత్తు, జండర్, బీపీ, షుగర్, బ్లడ్​గ్రూప్, హిమోగ్లోబిన్​పరీక్షలు నిర్వహిస్తారని, వీటితోపాటు గుండె, లివర్​తదితర వ్యాధుల వివరాలు కూడా సేకరిస్తారన్నారు. గతంలో ఉట్నూర్​లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సక్సెస్​అయ్యామని, ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రజల సౌకర్యార్థం వారి హెల్త్​ ప్రొఫైల్​తయారు చేసేందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం తయారు చేస్తున్నట్లు ఓఎస్డీ డాక్టర్​ గంగాధర్​చెప్పారు. ప్రతి మెడికల్​ఆఫీసర్​కి ట్రెయినింగ్​ఇస్తామని, ఏఎన్​ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలతో టీంగా ఏర్పాటు చేస్తామన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్​ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో 153 టీంలు ఏర్పాటు చేసి ఒక్కో టీంలో ఏఎన్​ఎం, హెల్త్​అసిస్టెంట్, ఇద్దరు ఆశా కార్యకర్తలతో పని చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండినవారు జిల్లాలో 2,60,620 మంది ఉన్నారని వివరించారు.