ప్రభుత్వ సెంటర్‌లో కరోనా వ్యాక్సిన్​కు డబ్బుల వసూలు

V6 Velugu Posted on Oct 03, 2021

  • రాజేంద్రనగర్ ​ఓల్డ్​ వెటర్నరీ కాలేజీ సెంటర్​లో దందా 

శంషాబాద్, వెలుగు: కేంద్రం కరోనా వ్యాక్సిన్​ప్రజలకు ఫ్రీగా వేస్తుంటే, రాజేంద్రనగర్ పరిధిలోని ఓ సెంటర్​లో  ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. సర్కిల్ లోని ఓల్డ్ వెటర్నరీ కాలేజ్ సెంటర్ లో కొద్దిరోజులుగా వ్యాక్సినేషన్​కొనసాగుతోంది. రోజుకు 400 మంది దాకా వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. సెంటర్ లో  ప్రైవేట్ వ్యక్తులు కూర్చుని వ్యాక్సిన్​రిజిస్ట్రేషన్ కోసమని రూ. 30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్ కోసం వచ్చిన జనాలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

మరోసారి పేరు మార్చుకున్న సమంత

బతుకమ్మ చీరలకు నిప్పు.. ఈ చీరలు  కవిత కట్టుకుంటదా ?

కేసీఆర్ మీ అందరికీ భర్త లాంటోడు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్

Tagged Hyderabad, corona vaccine, Rajendra nagar, Government Vaccine Center

Latest Videos

Subscribe Now

More News