
బతుకమ్మ చీరల పంపిణీలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన రాజయ్య.. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ నోరు జారారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేసుకునే ప్రతి మహిళకు కేసీఆర్ భర్తలా అన్నీ ఇస్తున్నాడని వ్యాఖ్యానించారు. బాలింతలకు ఒక అత్తలా, మామలా, భర్తలా కేసీఆర్ అన్నీ ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ కిట్టు ఇస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజయ్య వ్యాఖ్యలపై అక్కడి మహిళలు అవాక్కయ్యారు. ఇదేం మాట తీరు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం..
సీఆర్పీఎఫ్ బంకర్ సహా మూడు చోట్ల ఉగ్రదాడులు.. ఒకరు మృతి
క్లాప్ బాయ్ హీరో అయ్యిండు
రేవ్ పార్టీలో షారూఖ్ కొడుకుతోపాటు అరెస్టయిన వాళ్లు వీరే