షారూఖ్ కొడుకుతోపాటు అరెస్టయిన వాళ్లు వీళ్లే..

షారూఖ్ కొడుకుతోపాటు అరెస్టయిన వాళ్లు వీళ్లే..

ముంబై సముద్ర తీరంలో క్రూజ్ షిప్‌‌లో జరిగిన రేవ్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడులు చేసింది. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు అర్యాన్ ఖాన్, ముగ్గురు మహిళలు సహా మొత్తం 13 మందిని ఎన్సీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. పార్టీలో నిషేధిత కొకైన్, హషీష్, ఎండీ లాంటి డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ఈ దాడుల్లో అరెస్టులకు సంబంధించి ఎన్సీపీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే స్పందించారు. షారూఖ్ కుమారుడు అర్యాన్ ఖాన్‌తో సహా అరెస్టు చేసిన మరో 8 మంది వివరాలను ఆయన ప్రకటించారు. ‘అక్రమ రేవ్ పార్టీకి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశాం. అర్యాన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా, గోమిత్ చోప్రాను అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తున్నాం’ అని సమీర్ వాంఖడే పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

పదవి ఉన్నా లేకున్నా..  రాహుల్‌‌‌‌, ప్రియాంకకే  నా సపోర్టు

సర్కార్ ​బడుల్లో కోడింగ్​ ట్రైనింగ్

లీడర్ ఎలా ఉండాలో గడ్కరీని చూసి నేర్చుకోవాలె