లీడర్ ఎలా ఉండాలో గడ్కరీని చూసి నేర్చుకోవాలె

లీడర్ ఎలా ఉండాలో గడ్కరీని చూసి నేర్చుకోవాలె

పూణె:  కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసల జల్లులు కురిపించారు. అధికారాన్ని ఎంత ప్రభావవంతంగా వాడుకోవాలనేది గడ్కరీని చూసి నేర్చుకోవాలని పవార్ అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవార్.. స్టేజ్ మీద ఉన్న గడ్కరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలంటే గడ్కరీ లాంటి నాయకుల అవసరం చాలా ఉందని పవార్ పేర్కొన్నారు. 

‘ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి గడ్కరీయే కారణం. అహ్మద్ నగర్‌ సిటీలో చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టు పనులను ఆయన మొదలుపెడుతున్నారు. శంకుస్థాపనలు జరిగి ఎన్నేళ్లయినా పూర్తికాని ప్రాజెక్టులు ఎన్నో ఉంటాయి. కానీ గడ్కరీ విషయంలో అలా ఉండదు. ఆయన మొదలుపెట్టిన పనులను అతి త్వరగా ముగిస్తారు. ప్రజలు ఎన్నుకున్న నేతలు దేశాభివృద్ధి కోసం ఎలా పని చేయాలో చెప్పడానికి గడ్కరీ పెద్ద ఉదాహరణ. గడ్కరీ రోడ్లు, రవాణా శాఖ బాధ్యతలు తీసుకోక ముందు 5 వేల కి.మీ.ల రోడ్ల పనులు పూర్తయ్యాయి. కానీ ఆయన పదవిలోకి వచ్చాక దాన్ని 12 వేల కి.మీ.లకు పెంచారు’ అని శరద్ పవార్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం: 

షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

పదవి ఉన్నా లేకున్నా..  రాహుల్‌‌‌‌, ప్రియాంకకే  నా సపోర్టు

సర్కార్ ​బడుల్లో కోడింగ్​ ట్రైనింగ్