
న్యూఢిల్లీ: ‘‘పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వెంటే ఉంటా. గాంధీజీ, శాస్త్రీజీ సిద్ధాంతాలను పాటిస్తా. నన్ను ఓడించడానికి ఎన్ని నెగెటివ్ ఎనర్జీలు ప్రయత్నించినా పర్లేదు. నేను మాత్రం పాజిటివ్‌గానే ముందుకు సాగుతా. పంజాబీయత గెలుస్తుంది. ప్రతీ పంజాబీ గెలుస్తాడు’’ అని కాంగ్రెస్ పంజాబ్ స్టేట్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పంజాబ్ యూనిట్‌లో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన స్పందించారు. పోలీస్ చీఫ్, అడ్వొకేట్ జనరల్ సహా పలు నియామకాలపై కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తితో పార్టీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. కాగా, సీఎంతో చర్చల తర్వాత రాజీనామాపై సిద్ధూ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌గా ఆయనే ఉంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.