మరోసారి పేరు మార్చుకున్న సమంత

మరోసారి పేరు మార్చుకున్న సమంత

హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. తామిద్దరం విడిపోతున్నామంటూ చైతూ, సామ్ శనివారం ప్రకటించారు. అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న సామ్, చై.. ఎందుకు విడిపోయారా అంటూ ఫ్యాన్స్ ఆలోచనల్లో మునిగిపోయారు. 

ఈ క్రమంలో సమంత మరోమారు పేరు మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎస్ అనే అక్షరాన్ని తొలగించి.. సమంతగా మార్చేసింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌కు కూడా సమంత అనే పేరును మార్చింది.

చైతన్యతో విడాకుల అంశాన్ని ధృవీకరించిన సామ్.. ఇలా పేరు మార్చేయడం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. కాగా, చైతూతో విడాకుల రూమర్స్ బయటకి వచ్చిన కొత్తలో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో పూర్తిగా తన పేరు తొలగించి ఎస్ అనే అక్షరాన్ని ప్రొఫైల్ నేమ్‌గా పెట్టుకున్న సామ్.. మరికొన్ని ఖాతాల్లో జస్ట్ సమంత అనే పదాన్ని ఉంచింది. 

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్ మీ అందరికీ భర్త లాంటోడు

సమంతకు అక్కినేని ఫ్యామిలీ రూ.200 కోట్లు ఆఫర్?

షిప్‌లో రేవ్ పార్టీ.. ప్రముఖ హీరో కొడుకు అరెస్ట్!

లీడర్ ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలె