
హైదరాబాద్: క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ క్రేజీ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత తమ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. తామిద్దరం విడిపోతున్నామంటూ చైతూ, సామ్ శనివారం ప్రకటించారు. దీంతో వీరు ఎందుకు విడిపోయి ఉంటారా అని వారి ఫ్యాన్స్ ఆలోచనల్లో మునిగిపోయారు. చైతూ, సామ్ విడాకులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. సమంతకు అక్కినేని కుటుంబం భారీ భరణాన్ని ఆఫర్ చేసిందని పుకార్లు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.200 కోట్లను భరణంగా ఇస్తామని సామ్‌కు చైతూ ఫ్యామిలీ ఆఫర్ చేసిందని సమాచారం. అయితే దీన్ని సామ్ సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.
సినిమాలపై ఫోకస్
చైతూతో విడాకులతో బాధలో ఉన్న సామ్.. ఆ ప్రభావం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులపై పడకుండా ప్రయత్నిస్తోందని సమాచారం. ‘విడాకుల నుంచి వెంటనే తేరుకుని పనికి వెళ్లడం కుదరని పని. ఆమె గుండె పగిలింది. కానీ వ్యక్తిగత జీవితం వల్ల తాను ఒప్పుకున్న సినిమాలకు నష్టం జరగకూడదని సమంత భావిస్తోంది. ఆమె ఎప్పుడూ ప్రొఫెషనల్‌గానే వ్యవహరిస్తుంది’ అని సామ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.