బతుకమ్మ చీరలకు నిప్పు.. ఈ చీరలు  కవిత కట్టుకుంటదా ?

బతుకమ్మ చీరలకు నిప్పు.. ఈ చీరలు  కవిత కట్టుకుంటదా ?

యాదాద్రి, వెలుగు : సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేస్తున్న చీరలు కట్టుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడుతదా అని ఐద్వా భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి కొండమడుగు నాగమణి ప్రశ్నించారు. శనివారం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు క్వాలిటీగా లేకపోవడంతో యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత చీరలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నాసిరకం చీరలు సరఫరా చేయడం ఎంతవరకు కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చీరలకు బదులుగా మహిళల అకౌంట్లలో రూ. 1000 వేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఒక్కరోజు కూలికి పోతే ఇట్లాంటివి 3 చీరలు కొనుక్కోవచ్చు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బతుకమ్మ చీరలు ఊయల కట్టేందుకే పనికొస్తున్నాయని చుంచుపల్లి మండలం ఎన్​కే నగర్​ సర్పంచ్​ బాదావాత్​ సుగుణ విమర్శించారు. చుంచుపల్లి మండలంలోని కమ్మ సేవా సత్రంలో శనివారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు అధ్యక్షతన సాగిన బతుకమ్మ చీరల పంపిణీ ప్రోగ్రాంలో సర్పంచ్​ సుగుణ మాట్లాడారు. ఒక్కరోజు కూలీకి వెళ్తే ఇటువంటివి మూడు చీరలు కొనుక్కోవచ్చన్నారు. ఇప్పుడిస్తున్న చీరలు ఎక్కువ మంది కట్టుకోవడం లేదన్నారు. ఊయలలు కట్టుకునేందుకు, ఇతర పనులకు వాడుతున్నారన్నారు. పేదలకు మేలు చేయాలనుకుంటే చీరలు కాదని, డబుల్​ బెడ్​రూం ఇండ్లు, స్థలాలు ఇవ్వాలన్నారు. దీంతో అక్కడకు వచ్చిన మహిళలు చప్పట్లు కొట్టారు. దీంతో టీఆర్ఎస్​ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆమె కూర్చున్నారు. తర్వాత బాబూ క్యాంప్​ సర్పంచ్ ​బాబూరావ్​ మాట్లాడుతూ చీరలు  అందరికీ ఇవ్వాలని, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే ఎలా అంటూ నిలదీశారు.  

 బతుకమ్మ చీరెలకు నిప్పు

చిట్యాల, వెలుగు: ఓల్డ్ స్టాక్, నాణ్యత లేని చీరెలు ఇచ్చారని బతుకమ్మ చీరెలను మహిళలు ఛీ కొట్టారు. ఇలాంటి చీరెలు మాకెందుకని నిప్పు పెట్టి, నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటన జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ లో జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ..  ప్రభుత్వం క్వాలిటీ లేని చీరెలను పంపిణీ చేస్తోందన్నారు. ఈ చీరెలు బతుకమ్మ పండుగకు ఎలా కట్టుకుంటామని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో కవితమ్మ ఇలాంటి చీరెలు కడుతుందా అంటూ ప్రశ్నించారు.