Health Tip : ఉప్పుతో అనారోగ్యం అని ఫీలవుతున్నారా.. ఉప్పు బదులుగా ఇవి వాడండి

Health Tip : ఉప్పుతో అనారోగ్యం అని ఫీలవుతున్నారా.. ఉప్పు బదులుగా ఇవి వాడండి

వంటలకు రుచి రావాలంటే ఉప్పు ఉండాల్సిందే. అంతేకాదు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సరిపోను ఉండడానికి, మెదడు చురుకుదనం కోసం, గుండె ఆరోగ్యానికి ఉప్పు చాలా అవసరం. అందుకని రోజుకి కనీసం 1,500 మిల్లీగ్రాముల ఉప్పు తినాలి. కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, పచ్చళ్లు, రెడీమేడ్ సాస్, సలాడ్స్, శ్నాక్స్ తినడం వల్ల ఒంట్లోకి ఉప్పు ఎక్కువ చేరుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వంటల్లో ఉప్పుకు బదులు వీటిని ఉపయోగించాలని చేప్తోంది న్యూట్రిషనిస్ట్ లోవ్సత్ బత్రా.

ఉప్పు బదులు వంటల్లో నిమ్మరసం లేదా నిమ్మకాయని తురిమి వేయొచ్చు. నిమ్మకాయలోని విటమిన్ సి వంటకాల రుచిని పెంచుతుంది.

Also Read :- పెళ్లి కాలేదని.. ఫ్రెండ్స్ లేరని బాధపడుతున్నారా.. డోంట్ వర్రీ.. ఒంటరిగా ఉన్నా ఇలా హ్యాపీగా ఉండొచ్చు.

• నల్ల మిరియాలని పొడి చేసి కూరల్లో వేస్తే ఉప్పు ఎక్కువ వేయకున్నా పర్లేదు. దీని ఘాటు వాసన ఫుడ్ కి మంచి రుచినిస్తుంది. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ని తగ్గించి, గుండెజబ్బుల నుంచి కాపాడుతుంది.

• ఉప్పు బదులు కూరల్లో వెల్లుల్లి వేయాలి. దీనిలోని 'అల్లిసిన్' బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది.
ఉప్పు బదులు పులుపు, చేదు రుచితో ఉండే మెంతుల్ని వంటల్లో వేస్తే ఆరోగ్యానికి మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

• ఎండబెట్టిన మామిడికాయ ముక్కల (తొంకర్లు) పొడి కూడా వంటకాల రుచిని పెంచుతుంది. ఈ పొడిని కూరల్లోనే కాకుండా సలాడ్, సూప్స్ చట్నీల్లో కూడా వేయొచ్చు.