పప్పులు తింటే.. తిప్పలుండవు

పప్పులు తింటే.. తిప్పలుండవు

పప్పుకూర.. అనగానే.. చాలామంది పెదవి విరుస్తారు. కొంతమంది.. పప్పు పేరు వినగానే నాలుక చప్పరిస్తుంటారు. పప్పులు తింటే రోగాల తిప్పలుండవు. పప్పుల వల్ల తప్పే రోగాల తిప్పలేంటో.. షార్ట్​ అండ్​ స్వీట్​గా మీకోసం..

కందిపప్పు : ఇందులో ప్రొటీన్లు కావల్సినన్ని ఉంటాయి. ఇందులో ఉండే ఫోలెట్​ రక్తహీనతకు చెక్​ పెడుతుంది. ఎముక పుష్టికి సహకరిస్తుంది.

పెసరపప్పు : శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పెసర్లు ఉపయోగపడుతాయి. జట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్​గా పెసరపప్పు తినండి. రక్తపోటును కూడా తగ్గిస్తాయి.

మినపప్పు : కండరాల నిర్మాణానికి మినపపప్పు చాలా దోహదం చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

బబ్బెర్లు : ఇందులో పీచు, ప్రొటీన్లు, ఐరన్​ పుష్కలంగా ఉంటాయి. ఫాంక్రియాటిక్​ క్యాన్సర్​ని నివారించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

మసూరి పప్పు : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మసూరి పప్పు బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.