హెల్త్ టిప్స్ : ఎంత బరువు ఉంటే.. ఎంత వాటర్ తాగాలి..

హెల్త్ టిప్స్ : ఎంత బరువు ఉంటే.. ఎంత వాటర్ తాగాలి..

ఇటీవలి కాలంలో జీవన శైలిలో మార్పుల రిత్యా చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి అతి బరువు. ఈ సమస్యను అధిగమించేందుకు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరికి ఇది తేలికైన పనైతే.. మరి కొందరికి మాత్రం చాలా శ్రమతో కూడుకున్నది. అయితే బరువు తగ్గడానికి అనేక వ్యాయామాలు, ఆహారాలతో పాటు ఇంట్లో ఉండే నీటితోనూ ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నీరు బరువు తగ్గడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ తగినంత మొత్తంలో నీరు తాగడం శరీరానికి చాలా ముఖ్యం. ఇతర శరీరంలోని చాలా విధులను సులభంగా నిర్వహించడానితి సహాయపడుతుంది. తగినంత నీరు తీసుకోకపోతే శరీరంలో నిల్వ చేయబడిన కొన్ని పిండి పదార్థాలు, కొవ్వులు జీర్ణక్రియకు అడ్డుపడతాయి.

ALSO READ:బెయిర్‌స్టో ఔట్ వివాదం.. స్మార్ట్ గేమ్.. అందులో తప్పేమి లేదు..

కేలరీలను బర్న్ చేయడానికి..

చల్లని నీరు సరైన జీర్ణక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేస్తుంది.

ఆకలిని తగ్గించడంలో..

నీరు ఆకలిని తగ్గిస్తుంది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

అయితే బరువు తగ్గడానికి ఎంత మోతాదులో నీరు తాగాలన్న విషయం చాలా ముఖ్యం. శరీర బరువును బట్టి నీటి వినియోగం కూడా మారుతుంది. కాబట్టి మొదట మీ బరువును చెక్ చేసుకోండి. 80 కిలోలున్న వ్యక్తితో పోలిస్తే 55కిలోలున్న వ్యక్తికి తక్కువ నీరు అవసరం. మీ బరువు 60 కిలోలుంటే దాన్ని 30తో భాగించండి. అంటే మీరు రోజుకు 2 లీటర్ల నీరు తాగాలన్నమాట. కొన్ని సార్లు వ్యాయామం చేయడం వల్ల నీరు తీసుకునే పరిణామం కూడా పెరుగుతుంది. ఆ సమయంలో ప్రతి 30 నిమిషాల వ్యాయామంలో సుమారు 350మి.లీ. నీటిని తీసుకోండి.