ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో అభిషేక్‭కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో అభిషేక్‭కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‭ను.. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈనెల 9న చేపట్టనుంది. అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని.. సీబీఐ అధికారులు కోర్టును కోరారు. నిందితుడు పలుకుబడి ఎక్కువగా ఉన్నవాడని.. అతడు బయటికి వస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే సమీర్ మహేంద్రుతో ఎలాంటి నగదు లావాదేవీలు లేవని అభిషేక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు జరిగిన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు న్యాయవాది తీర్పు చెప్పారు. 

ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిన వ్యవహారంలో.. అభిషేక్ రావు కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు తేల్చారు. అయితే.. ఈ వ్యవహరంలో వ్యాపార, రాజకీయ ప్రముఖుల వివరాలను ఆరా తీశారు. అభిషేక్ రావును కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ.. అతడు సరైన సమాధానాలు చెప్పలేదని వారు తెలిపారు. నిందితుడికి సంబంధించి వ్యాపార లావాదేవీలు, ఎక్కడ ఎక్కడ నుండి నగదు బదిలీ జరిగింది వంటి అనేక విషయాల‭పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.