వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఓడిందని.. ఇద్దరు ఆత్మహత్య

వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా ఓడిందని.. ఇద్దరు ఆత్మహత్య

ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత, 23 ఏళ్ల రాహుల్ లోహర్ నవంబర్ 19న రాత్రి 11 గంటలకు బంకురాలోని బెలియోటోర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సినిమా హాల్ కి వెళ్లాడు. మ్యాచ్ ఫలితంతో గుండె పగిలిన అతను తన గదిలో ఉరివేసుకున్నాడని లోహర్ బావమరిది ఉత్తమ్ సూర్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నవంబర్ 20న ఉదయం బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దీన్ని పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

ఒడిశాలో

ఒడిశాలోని జాజ్‌పూర్‌లో, నవంబర్ 19న రాత్రి మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే మరో 23 ఏళ్ల యువకుడు బింజర్‌పూర్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు దేవ్ రంజన్ దాస్ అనే వ్యక్తి అని, ఎమోషనల్ డిజార్డర్ సిండ్రోమ్  కోసం అతను చికిత్స పొందుతున్నాడని అతని మామ పోలీసులకు తెలిపారు.

ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో అతను నిరాశతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తాము అసహజ మరణం కేసును నమోదు చేశామని, పోస్ట్ మార్ట్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని జారి అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి ఆఫీసర్ ఇంద్రమణి జువాంగా చెప్పారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి భారత్ కలలను చెరిపేసింది. వారు ఆరోసారి ట్రోఫీని గెలుచుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం వారి 2011 ఫీట్‌ను రిపీట్ చేయనివ్వలేదు.