డ్రైనేజీలో పడ్డ ఏనుగు, ఏనుగు పిల్లను కాపాడిన వైద్యులు

డ్రైనేజీలో పడ్డ ఏనుగు, ఏనుగు పిల్లను కాపాడిన వైద్యులు

డ్రైనేజీలో కూరుకుపోయిన తల్లి ఏనుగును, దాని పిల్లను రెస్క్యూ అధికారులు బయటకు తీశారు. అనంతరం సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన ఓ హృదయపూర్వక వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది. థాయ్‌లాండ్‌లోని నఖోన్ నాయోక్ ప్రావిన్స్‌లో తుఫాను కారణంగా నేలంతా బురదగా మారిపోయింది. దీంతో ఏనుగు, ఏనుగు పిల్ల 7 అడుగుల లోతైన డ్రైనేజీ గుంటలో పడిపోయాయి. ఈ వీడియోను ది ఫిగెన్ అనే పేరుతో ఉన్న అడ్మిన్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

విషయం తెలుసుకున్న పశువైద్యులు ఏనుగుకు ఎలాంటి హానీ కలగనివ్వకుండా బయటికు తీసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వచ్చిన భారీ వర్షం వారి రెస్క్యూ పనికి అంతరాయం కలిగించినప్పటికీ, ఎంతో పోరాటం చేశారు. డ్రెయిన్ గుంట నుంచి పిల్ల ఏనుగు వైద్యుల సిబ్బంది సాయంతో ఎలాగోలా బయటికి వచ్చింది. కానీ తల్లి ఏనుగు బయటకు వచ్చేందుకు ప్రయత్నించి, అలసిపోయింది. అయినప్పటికీ దాన్ని బయటికు తీసినా.. తల్లి ఏనుగుకు వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. పశువైద్యులు చివరి ప్రయత్నంగా సీపీఆర్ చేయగా ఆ ఏనుగు ప్రాణాలతో బయటపడింది.

https://twitter.com/TheFigen_/status/1638219174722912256