వడదెబ్బ… తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వడదెబ్బ… తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ తగులుతుంది. శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది.ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు ఉష్ణోగ్రత అదుపు తప్పి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకపోవడం, చల్లని నీళ్లను తాగుతూ శరీరాన్ని సమతులంగా ఉంచుకోవటం వంటి సాధారణ జాగ్రత్తలతో వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చు. అదే పనిగా ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని లేదు, మన శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఇంట్లో కూర్చున్నావడదెబ్బ తగులుతుంది. దీనివల్ల శరీరం ఉష్ణో గ్రత విపరీతం పెరిగి, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది.కొన్నిసార్లు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఉష్ణో గ్రత ఎక్కువైతే….

సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది.అంతకంటే ఉష్ణో గ్రత కొంచెం పెరిగితే జ్వరం వచ్చినట్లు చెబుతారు. ఉష్ణో గ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ పెరిగితే సన్‌ స్ట్రో క్‌ (వడదెబ్బ) తగిలినట్లు లెక్క.వేసవిలో ప్రధానంగా దీని బారిన పడేవాళ్లు చాలామంది ఉంటారు. వేసవిలో సూర్యుడి తాపం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలను నిర్లక్ష్యం చేస్తూ ఎక్కు వగా ఎండలో తిరిగితే వడదెబ్బకు గురవుతారు.

ఎందుకు వస్తుంది…?

ఎక్కు వగా ఎండలో తిరగడం వల్ల హృదయ స్పందనలో కలిగే మార్పుల కారణంగా మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతుంది. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవటంతో సన్‌ స్ట్రో క్‌ తగిలి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40 శాతం మేర వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటాయి. లక్షణాలు శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడుస్వాధీనంలో ఉండవు. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మిగతా అన్ని జబ్బులను నయం చేసుకోడానికి కొంత వ్యవధి ఉంటుంది. కానీ వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడమన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలలో జరిగిపోవచ్చు. చర్మం పొడిబారిపోవడం అన్నది కేవలం చర్మ సంబంధ సమస్య కాదు. శరీరంలో నీటి పరిమాణం పడిపోయిందని చెప్పే ఒక సూచన.వడదెబ్బ నుంచి కాస్త కోలుకున్నామని అనిపించిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లొద్దు.

సాధారణంగా ఐదేళ్ల లోపు, 60 సంవత్సరాలు పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు గురవుతారు.ఒక్కో సారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదే విధంగా గర్భిణీలు,బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకుంటూ ఉండాలి. క్రీడాకారులు, స్థూలకాయులు,దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నవారు, ఆరు బయట వ్యాయామం. పోలీసు వంటి వృత్తుల్లో ఉన్న వాళ్లు శరీరం డీ హైడ్రేట్‍ కాకుండా చూసుకోవాలి. మద్యం తీసుకునేవాళ్లు,మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్లు చాలా కేర్ ల్ గా ఉండాలి.కొన్ని మందులు వాడే వారు. పొడి చర్మం, వేడి చర్మం ఉన్న వాళ్లు, స్వేద రంధ్రాలు తక్కు వగా ఉండే వాళ్లకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరంతా ఎండకు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

దారి తీసే లక్షణాలు…

వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్త కణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతినడానికి దారి తీస్తుంది. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బను అధిగమిం చవచ్చు. వడదెబ్బ తగిలిన రోజంతా విశ్రాంతి తీసుకుంటేనే శరీర వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తరలించాలి. శరీరాన్ని చల్లటి నీళ్లతో లేదా ఐస్ తో తుడవాలి.వెంటనే డాక్టర్‍ దగ్గరకు తీసుకెళ్లాలి.వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. తరచూ నీళ్లు తాగుతుండాలి. కళ్లకు కూలింగ్‍ గ్లాసెస్‍ పెట్టుకోవాలి. అలాగే బయటకి వెళ్లేటప్పుడు వాటర్‍ బాటిల్‍ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.

ముందు జాగ్రత్తలు…

..సన్‌ స్ట్రో క్‌ నుంచి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి.

..ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు,స్కార్ఫ్‌ లు వాడితే మంచిది.

..ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలోతిరగకపోవటం ఉత్తమం.

..ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీ టర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.ఓ.ఆర్‌‌.ఎస్‌ . నీళ్ళు, కొబ్బరికాయ,గ్లూ కోజ్‌ నీరు తీసుకోవటం మంచిది.

..విద్యార్థు లు పరీక్షల సమయం కావటంతో ఎండ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సాయంత్రం సమయంలో ఆడుకోవటం మంచిది.

..నూనె పదార్థాల వాడకం తగ్గించాలి.

..ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి,పళ్లరసాలు తాగుతుండాలి.

..శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి. చెమటను గ్రహించే, చల్లగా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి

.. వేసవిలో శీతల పానీయాలు అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలోని లవణాలు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చు.

ఫస్ట్ ఎయిడ్‍…

వడదెబ్బ తగిలిన నీడలో ఉంచాలి.బట్టలు వదులు చేసి(25-–30 డిగ్రీల)నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్‌ ప్యాక్ లు పెట్టాలి.వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.