శ్రీశైలంలో బారులు తీరిన భక్తులు... మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం...

శ్రీశైలంలో బారులు తీరిన భక్తులు... మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం...

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam)లోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల(Devotees) రద్దీ పెరిగింది. ఈ రోజు తొలి ఏకాదశి ( జులై 6) సందర్భంగా ముక్కంటి దర్శనానికి  భక్తులు శ్రీశైలానికి బారులు తీరారు. అలాగే ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.