
శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4లక్షల 89వేల361 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం రిజర్వాయర్లో 883.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 206.0996 టీఎంసీలకు చేరింది. కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.