తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చెన్నై ప్రాంతంలో ఉంటున్న ప్రైవేట్ ఉద్యోగులకు వర్షాలు తగ్గేంతవరకూ 3 రోజులపాటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దగ్గరుండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాడు.
చెన్నై ప్రాంతంలోని పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంతంలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ లేనట్లు సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా డ్రైనేజీ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇలా భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ నీరు చేరుతోంది. దీంతో పోయిస్ గార్డెన్ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ALSO READ | రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో మంజు వారియర్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సనగేతమ అందించారు.