ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం

ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం
  • ‘సివియర్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌గానే పరిస్థితి.. 418గా నమోదైన ఎక్యూఐ
  • బీఎస్3 పెట్రోల్, బీడీ4 డీజిల్ కార్లపై తాత్కాలిక బ్యాన్

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నది. ‘సివియర్’ కేటగిరీలోనే కొనసాగుతున్నది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 418గా నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వెల్లడించింది. ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. గాలులు వీచే వేగం తగ్గడంతో.. కాలుష్యంలో తీవ్రత తగ్గడం లేదు. పొగ మంచు కారణంగా ఎదురుగా ఏమున్నదీ కనిపించనంతగా పరిస్థితి తయారైంది. దీంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి.

ఏక్యూఐ ఆదివారం 371గా ఉండగా.. సోమవారానికి 434కి పెరిగిపోయింది. మంగళవారం కొంచెం తగ్గినా.. సివియర్ స్థాయిలోనే ఉంది. బీఎస్3 పెట్రోల్, బీడీ4 డీజిల్ కార్లపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం దాకా బ్యాన్ అమల్లో ఉంటుందని చెప్పింది. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఆఫీసర్లు చెప్పారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే.. శుక్రవారం లోపే బ్యాన్ ఎత్తివేస్తామని వివరించారు.