రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగడ్ల వాన

రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగడ్ల వాన

మార్చి 24 శుక్రవారం రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ద్రోణి ప్రభావంతో మార్చి 25 శనివారం జార్ఖండ్ నుండి ఛత్తీస్‌గఢ్, విదర్భ మరియు ఉత్తర తెలంగాణ, కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కీమీ ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఈ నెల 25, 26న రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

మార్చి 25 శనివారం తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య, తూర్పు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు...ఈదురు గాలులతో కూడిన వడగడ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మార్చి 26న ఉత్తర, ఈశాన్య జిల్లాలకు రెయిన్ అలర్ట్స్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు ..ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. మరోవైపు శనివారం హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయిని వాతావరణ అధికారులు తెలిపారు.