హైదరాబాద్ లో భారీ వర్షం.. మరో 24 గంటలు వానలే

హైదరాబాద్ లో భారీ వర్షం.. మరో 24 గంటలు వానలే

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్,జూబ్లీహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట, యూసఫ్ గూడ, బోరబండ, కూకట్ పల్లి,లింగంపల్లి, బాచుపల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బోయినపల్లి, బాలానగర్,  మెహిదీపట్నం షేక్ పేట, అల్వాల్,  గాలులతో కూడిన వర్షం పడుతోంది. మిగతా ఏరియాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

జీహెచ్ఎంసీ నగరవాసులను అలర్ట్ చేసింది.  మరో 24 గంటలు భారీ వర్షాలు పడే అవకాశముందని.. ఎమర్జెన్సీ అయితే తప్ప  బయటకు రావొద్దని హెచ్చరించింది.  లోతట్టు ప్రాంతాల ప్రజలను  ప్రమత్తంగా ఉంచాలంటూ అధికారులను  ఆదేశించింది.