కర్ణాటకలో భారీ వర్షాలు

కర్ణాటకలో భారీ వర్షాలు

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం 200 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దింపింది ఆ రాష్ట్ర సర్కారు. కర్ణాటకలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.