ఢిల్లీ వాతావరణంలో సడన్ ఛేంజ్.. 22 విమానాలు దారి మళ్లింపు

ఢిల్లీ వాతావరణంలో సడన్ ఛేంజ్.. 22 విమానాలు దారి మళ్లింపు

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. నిన్నమొన్నటి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులకు చల్లని గాలితో వర్షం చినుకులు తాకాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం (ఏప్రిల్ 13) సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు రావడంతో వర్షం ఇన్నిరోజుల వేడి తాపం నుంచి ఉపశమనం కలిగించింది.

ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ అంచనా ప్రకారం ఈ సంవత్సరం జూన్, సెప్టెంబర్ మధ్య భారతదేశంలో సాధారణ రుతుపవనాలు వీస్తాయని ప్రకటించింది. నాలుగు నెలలకు 868.6 మిల్లీమీటర్ల వర్షాపాతం, సగటులో 102 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితి నెలకొనడంతో సాయంత్రానికి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన 22 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.